Telangana Weather Updates Today : తెలంగాణ రైతులను వరణుడు భయపెట్టిస్తున్నాడు. అకాల వర్షంతో అన్నదాతలను కష్టపెడుతున్నాడు. ఆరుగాలం పండించిన పంటను నీటిపాలు చేస్తున్నాడు. ఇప్పటికే వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయి అల్లాడిపోతున్న కర్షకుల్లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక గుబులు రేపింది.
తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు.. రైతుల గుండెల్లో గుబులు - తెలంగాణలో వర్షాలు న్యూస్
Telangana Weather Updates Today :తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు బంగాళాఖాతంలోని ప్రాంతాలకూ విస్తరించాయని తెలిపింది. వర్షం ప్రభావంతో గురువారం రాష్ట్రంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులువీచే అవకాశం ఉందని వెల్లడించింది.
Today Telangana Weather Updates : రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న అధికారుల హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన ధాన్యం కూడా నోటికాడికి వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని..... జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పశ్చిమ, నైరుతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్న హైదరాబాద్ వాతావరణ సంచాలకురాలు నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...
ఇవీ చదవండి :మట్టిని తవ్వారు.. మహాశివలింగం బయటపడింది
ఆ తమిళ దర్శకులతో రామ్చరణ్, అల్లుఅర్జున్ కొత్త సినిమా!