Rajasingh arrest: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్... రాజాసింగ్‌కు 14రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. రాజాసింగ్‌కు మద్దతుగా భారీగా కోర్టు వద్దకు ఆయన అనుచరులు వచ్చారు. మంగళ్‌హాట్ పీఎస్‌లో ఖదీర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అనంతరం ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. అన్ని పీఎస్‌లల్లో నమోదైన కేసులు ఒకే ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేయనున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో నాంపల్లి కోర్టు సమీపంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నాంపల్లిలో రాజాసింగ్‌కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. మరోవైపు రాజాసింగ్ వర్గీయుల ఆందోళన చేయడంతో వాతావరణం రణరంగాన్ని తలపించింది. ఇరువర్గాల నినాదాలతో కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఇరువర్గాలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై వివిధ పీఎస్‌ల్లో ఫిర్యాదులు అందాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బాలాపూర్, కుషాయిగూడ పీఎస్‌ల పరిధిలోనూ ఫిర్యాదులు వచ్చాయని సీపీ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు చోట్ల కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. రాచకొండ పరిధిలోని చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి నిరసనలు జరిగాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.