గత ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, భూముల లావాదేవీలపై సమగ్ర విచారణకు ఏర్పాటు చేసిన సిట్‌కు...... ప్రభుత్వం పోలీస్‌స్టేషన్ హోదా కల్పించింది. సీఆర్పీసీలోని సెక్షన్ 2ను అనుసరించి... కేసుల నమోదు, దర్యాప్తు అధికారాన్ని అప్పగించింది. దీనికి రాష్ట్ర మొత్తం పరిధి ( జ్యూరిడిక్షన్) కల్పించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొన్న అవకతవకలపై సిట్ దర్యాప్తు చేయనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలతో సంప్రదింపులు సమన్వయం చేసుకునే నోడల్ ఏజెన్సీగా వ్యవహారిస్తోంది. దర్యాప్తు చేస్తున్న అంశాలకు సంబంధించి ఏ వ్యక్తినైనా, అధికారినైనా విచారణ నిమిత్తం పిలిపించి.. వాంగ్మూలాల్ని నమోదు చేసుకునే అధికారాన్ని సిట్‌కు ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
'సిట్'కు పోలీసుస్టేషన్ హోదా.. ఉత్తర్వులు జారీ
గత ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భూలావాదేవీలపై సమగ్ర విచారణకు ఏర్పాటు చేసిన సిట్‌కు ప్రభుత్వం..పోలీసుస్టేషన్ హోదా కల్పించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Police station status for SIT on investigation of past government policies, decisions and land transactions