రెండు రోజుల పాటు భారీ వర్షాలు (heavy rains in telangana) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ( Department of Meteorology )హెచ్చరికలతో తెలంగాణ పోలీసు శాఖ (ts police) అప్రమత్తమైంది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ (hyderabad cp anjani kumar)... ఉన్నతాధికారులు, సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
భాగ్యనగర ప్రజలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసు శాఖ (police department) హెచ్చరిక జారీ చేసింది. ఎలాంటి సమస్య ఉన్న డయల్ 100కి (dial 100) లేదా స్థానిక పోలీసులకు గానీ, పెట్రోలింగ్ సిబ్బందికి గానీ సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. లా అండ్ అర్డర్ (law and order) ట్రాఫిక్‌తో పాటు పలువురు అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని వెల్లడించారు. నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి ప్రవాహాలు దాటేందుకు ప్రయత్నించొద్దని తెలిపారు.