డిమాండ్ల సాధన కోసం తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె చేపట్టి రెండు వారాలు పూర్తయింది. ఆందోళనలు, ర్యాలీలు, వంటా వార్పు, మానవహారాలతో తమ నిరసన తెలిపిన కార్మిక సంఘాలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌ను విజయవంతం చెయ్యాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఇవాళ ద్విచక్ర వాహాన ర్యాలీలు నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కొన్ని రెవెన్యూ సంఘాలతో పాటు ఓలా, ఊబర్ క్యాబ్స్ కూడా తమ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు బంద్ కొనసాగుతోంది.
నేడు తెలంగాణ బంద్.. వ్యూహరచనలో పోలీసులు
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అన్ని రాజకీయ, ప్రజా సంఘాలు ఐక్యంగా ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బంద్ కొనసాగుతోంది. ప్రజారవాణా వ్యవస్థను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు బంద్‌కు దిగాయి. ఈ బంద్ పిలుపునకు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర కార్మిక సంఘాలూ మద్దతు ప్రకటించాయి.
తెలంగాణ బంద్.. ముందస్తు వ్యూహరచనలో పోలీసులు
పోలీసుల ముందు జాగ్రత్త చర్యలు
మరోవైపు సాధారణ జనజీవనానికి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అన్ని ఆర్టీసీ డిపోలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ జేఏసీ నేతలతోపాటు పలు పార్టీలకు చెందిన పలువురి నేతలను అదుపులోకి తీసుకున్నారు.
అటు భాజపా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని.. విజయవంతం చేయాలని నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Last Updated : Oct 28, 2019, 8:28 AM IST