ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం టెండరు నోటీసుకు స్పందన కరవు...బరిలో మేఘా మాత్రమే - polavaram

పోలవరం ప్రధాన డ్యాం , జలవిద్యుత్‌ కేంద్రం పనులకు కలిపి జలవనరుల శాఖ ఆహ్వానించిన టెండరు నోటీసుకు స్పందన కరవైంది. ఒకే ఒక్క గుత్తేదారు ఏజెన్సీ స్పందించింది. మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ మాత్రమే గడువులోగా తన బిడ్‌ను దాఖలు చేసింది.

పోలవరం టెండరు నోటీసుకు స్పందన కరవు...బరిలో మేఘా మాత్రమే

By

Published : Sep 22, 2019, 5:28 AM IST

పోలవరం ప్రధాన డ్యాం, జలవిద్యుత్ కేంద్ర పనులకు కలిపి జలవనురుల శాఖ ఆహ్వానించిన టెండర్ నోటీసులకు ఒకే ఒక్క గుత్తేదారు ఏజెన్సీ సంస్థ స్పందించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ మాత్రమే గడువులోగా తన బిడ్ ను దాఖలు చేసింది. ప్రీబిడ్ సమావేశానికి దాదాపు 8సంస్థలు హాజరై తమ సందేహాలు నివృత్తి చేసుకున్నా గడువు ముగిసే నాటికి మేఘా సంస్థ ఒక్కటే బిడ్ వేసింది. దీంతో సింగిల్ టెండర్ మాత్రమే దాఖలైనట్లుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 23న ఆర్థిక బిడ్ తెరవాలి. రివర్స్ టెండర్లు నిర్వహించాలి. ప్రస్తుతం ఒకే ఒక్క సంస్థ టెండరు దాఖలు చేయటంతో జలవనరులు శాఖ ఎలా ముందుకు వెళ్తుందనేది చర్చనీయాంశమైంది.
ప్రధాన డ్యాం వద్ద మిగిలి ఉన్న పనులకు రూ. 1771.44 కోట్లు, 960 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పనులకు రూ.3216.11కోట్ల అంచనా విలువతో జల వనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. గడువులోగా మేఘా సంస్థ ఒక్కటే టెండరుకు సంబంధించిన అసలు డాక్యుమెంట్లను, బ్యాంకు గ్యారెంటీ పత్రాలను సమర్పించింది. గతంలో ఈ రెండు పనులను నవయుగ వేర్వేరుగా చేపట్టింది.
ప్రభుత్వ మారక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి నివేదిక మేరకు ప్రభుత్వం నవయుగతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు పనులనూ కలిపి జలవనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. రివర్స్ టెండర్ల ప్రక్రియలో బిడ్లను ఆహ్వానించింది. ఈ పనులకు గుత్తేదారు సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు శుక్రవారం తుది గడువు. శనివారం సాయంత్రం ఐదింటిలోపు టెండరు దాఖలుకు సంబందించిన అసలు డాక్యుమెంట్లు, బ్యాంకు గ్యారెంటీ పత్రాలును పోలవరం అధికారుల సమర్పించాలి. శనివారం సాయంత్రంతో గడువు ముగియగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఒక్కటే వీటిని సమర్పించింది. ఈ విషయాన్ని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ధ్రువీకరించారు.

ABOUT THE AUTHOR

...view details