ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Birth Day Wishes to CM KCR: కేసీఆర్​కు మోదీ బర్త్‌డే విషెస్.. కేటీఆర్ ఎమోషనల్‌ ట్వీట్ - కేసీఆర్​ గురించి కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

Birth Day Wishes to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధిపతి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్​ కూడా ట్విటర్ వేదికగా.. కేసీఆర్​కు బర్త్‌ డే విషెస్ చెబుతూ ఎమోషనల్‌ పోస్టు పెట్టారు.

Birth Day Wishes to CM KCR
Birth Day Wishes to CM KCR

By

Published : Feb 17, 2022, 10:33 AM IST

Birth Day Wishes to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

డాడ్.. యూ ఆర్ మై హీరో..

KTR Birth Day Wishes to KCR: తెలంగాణ సీఎం కేసీఆర్​కు ఆయన తనయుడు కేటీఆర్ భావోద్వేగకరంగా పుట్టిన రోజు విషెస్ చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా కేసీఆర్ మార్చుకున్నారని కేటీఆర్ కొనియాడారు. దయతో నిండిన హృదయంతో అందర్ని ముందుకు నడిపిస్తారని అన్నారు. కేసీఆర్​కు.. సవాళ్లను ధైర్యం ఎదుర్కొనే సత్తా ఉందని తెలిపారు. ''నా నాయకుడు.. నా తండ్రి.. అని'' గర్వంగా పిలుచుకుంటానని ట్విటర్ వేదికగా కేటీఆర్ ఎమోషనల్​ పోస్ట్ చేశారు.

కేసీఆర్ పుట్టినరోజు.. తెలంగాణకు పండుగరోజు..

సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ పుట్టినరోజు తెలంగాణకు పండుగరోజని అన్నారు. దశాబ్దాల తెలంగాణ కల కేసీఆర్ వల్లే సాకారమైందని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారిందిని చెప్పారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని 5 కోట్ల ప్రజానీకం ఆకాంక్షిస్తోందని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో కేసీఆర్ హవా..

Modi Wishes KCR on his Birthday : మరోవైపు సోషల్ మీడియాలో కేసీఆర్​కు శుభాకాంక్షల జల్లు కురుస్తోంది. హ్యాపీ బర్త్‌ డే కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్​లో ఉంది. రాష్ట్రంలోని పలు చోట్ల కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. కేక్ కటింగులు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details