తెలంగాణ.. కుమురం భీం ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో పులాజి బాబా వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్థులంతా పాల్గొని భోజనాలు చేస్తుండగా.. పలువురు చిన్న పిల్లలు ఆ ఆహారాన్ని తినడానికి ఇబ్బందిపడ్డారు. ఇది గమనించిన పెద్దలు.. అనుమానంతో అన్నాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. మంటలో వేసి చూడగా ప్లాస్టిక్‌గా కాలిపోయింది. దీంతో ప్లాస్టిక్ బియ్యంగా స్థానికులు నిర్థరించారు.
గ్రామస్థులంతా కలిసి బియ్యం కొనుగోలు చేసిన దుకాణం ఎదుట బైఠాయించారు. యజమాని వచ్చి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.