స్థానిక పోరు: న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు - ap latest news
12:17 January 25
సుప్రీం కోర్టులో విచారణ దృష్ట్యా తిరస్కరణ
ఓటరుగా అర్హత కలిగిన సుమారు 3.6 లక్షల మంది 18 ఏళ్లు పైబడిన యువతకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోందని ఈ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది శివప్రసాద్ రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. పంచాయతీ ఎన్నికల వ్యవహారాన్ని సోమవారం సుప్రీంకోర్టు తేల్చబోతున్నందున వేచి చూద్దామని న్యాయమూర్తి జస్టిస్ డి.పి.ఎస్ఎస్ సోమయాజులు పేర్కొన్నారు . ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ .. షెడ్యూల్ విడుదల చేసిందని గుర్తు చేశారు . 2019 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తే .. 3.6 లక్షల మంది ఓటు హక్కును కోల్పోతారని , ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వ్యాయవాది మరోసారి అభ్యర్థన చేశారు . ఓటరుగా అర్హత ఉన్నా హక్కు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు . అత్యవసరంగా విచారణ జరపలేమని తేల్చి చెప్పిన న్యాయమూర్తి ... మరొకరోజు మీ అభ్యర్థనను పరిశీలిస్తామన్నారు . పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను సక్రమంగా ఖరారు చేయలేదని , కొన్ని చోట్ల అర్హులైన ఓటర్లను తొలగించారని ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ జరపాలని మరో ఇద్దరు న్యాయవాదులు చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
ఇదీ చదవండి: