ETV Bharat / city
పెండింగ్ స్థానాలు.. ఎవరికి టికెట్లు? - mla candidates
ఇప్పటికీ అభ్యర్ధులు ఖరారు కాని 14 అసెంబ్లీ స్థానాల ఆశావహులతో తెదేపా అధినేత చంద్రబాబు అమరావతిలో విడివిడిగా సమావేశం కానున్నారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ స్థానాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పెండింగ్ స్థానాలపై సీఎం సమీక్ష
By
Published : Mar 11, 2019, 12:59 PM IST
| Updated : Mar 11, 2019, 1:18 PM IST
పెండింగ్ స్థానాలపై సీఎం సమీక్ష శాసనసభ ఎన్నికల అభ్యర్థుల ఖరారులో తెదేపా అధినేత చంద్రబాబు వేగం పెంచారు. పెండింగ్లో ఉన్న 14 నియోజకవర్గాల ఆశావహులతో వేర్వేరుగా సమావేశమవుతున్నారు. నరసారావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల నాయకులతో భేటీ అయ్యారు. పాతపట్నం, గూడూరు, చీపురుపల్లి, గుడివాడ, పాయకరావుపేట, నిడదవోలు, అవనిగడ్డ నేతలతో చర్చిస్తున్నారు.నరసరావుపేట లోక్‌సభ స్థానాన్నిఎంపీ రాయపాటి ఆశిస్తున్నారు. నరసరావుపేట అసెంబ్లీ స్థానాన్నికోడెల కుటుంబం ఆశిస్తున్నట్ట సమాచారం. సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోడెల శివప్రసాదరావు ఉండగా... రాయపాటి రంగబాబు టికెట్ ఆశిస్తున్నారు. మాచర్ల స్థానం నుంచి చలమారెడ్డి, అంజిరెడ్డి పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదే స్థానం నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించాలనుకుంటే బోనబోయిన టికెట్ ఇస్తే ఎలా ఉంటుందా అని అధినేత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నరసరావుపేట అసెంబ్లీకి రావెల సత్యం పేరు...గురజాల నుంచి మరోసారి సిట్టింగ్ యరపతినేని పేరును అధినేత పరిశీలిస్తున్నారు. వినుకొండ నుంచి మరోసారి జీవీ ఆంజనేయులు.. చిలకలూరిపేట నుంచి మరోసారి మంత్రి ప్రత్తిపాటి, పెదకూరపాడు నుంచి మళ్లీ కొమ్మాలపాటి శ్రీధర్ పోటీ చేయాలని ఆశిస్తున్నారు. Last Updated : Mar 11, 2019, 1:18 PM IST