ఈ నెల 30న రాజధాని ప్రాంతంలో జనసేనాని పవన్ పర్యటించనున్నారు. మంగళగిరి మండలం నిడమర్రు నుంచి పవన్ పర్యటన ప్రారంభం కానుంది. ప్రభుత్వం చేపట్టిన రోడ్లు, భవనాలు, ఎత్తిపోతల పథకాలను జనసేనాని పరిశీలించనున్నారు. అనంతరం రాజధానికి భూములు ఇచ్చిన రైతులతోపాటు వ్యవసాయ కూలీలను కలవనున్నారు. భూసమీకరణ ఒప్పందం అమలు గురించి ఆరా తీయనున్నారు. ఈ నెల 31న మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాజధాని రైతులతో సమావేశం నిర్వహించి... రాజధాని రైతులు, ప్రజల అభిప్రాయాలను జనసేన అధ్యక్షుడు తెలుసుకోనున్నారు.
ఈనెల 30 న రాజధాని ప్రాంత రైతులతో పవన్ భేటీ - rajadhanai
అమరావతిలో ఈ నెల 30న జనసేనాని పర్యటించనున్నారు. రాజధాని మార్పుపై వస్తున్న వార్తలతో... పవన్ను ఆ ప్రాంత రైతులు కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పర్యటించి... భూ సమీకరణ ఒప్పందం అమలు.. ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై ఆరా తీయనున్నారు.
రాజధాని ప్రాంతంలో ఈనెల 30న జనసేనాని పర్యటన