ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆసరా పథకాన్ని గ్యాస్​ రూపంలో లాగేశారు: పంచుమర్తి - panchumarthi anuradha on hikes vat on natural gas

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. సహజవాయువుపై వ్యాట్​ పెంచడం దారుణమన్నారు. ఆసరా పథకాన్ని గ్యాస్​ రూపంలో లాగేశారని ఆరోపించారు. సంక్షేమం కోసం పన్నులు పెంచటమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.

panchumarthi anuradha
panchumarthi anuradha

By

Published : Sep 12, 2020, 10:05 PM IST

ఆసరా పథకాన్ని గ్యాస్ రూపంలో లాగేశారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. సంక్షేమ పథకాల్లోనూ జగన్మోహన్​రెడ్డి క్విడ్ ప్రో కో కు పాల్పడటం సిగ్గుచేటని ఆమె దుయ్యబట్టారు. సహజవాయువు పై వ్యాట్ 14.5శాతం నుంచి 24.5శాతం పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలోని 1.34 గ్యాస్ వినియోగదారులపై 1500 కోట్ల రూపాయల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే విద్యుత్, ఆర్టీసీ, పెట్రోలియం, మద్యం ధరలు పెంచి 60 వేల కోట్ల భారం మోపారన్న ఆమె... ప్రజలకు గోరంత సాయం చేసి.. కొండంత దోచేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోసం పన్నులు పెంచటమేమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతు భరోసా, పెన్షన్ల సొమ్మును.. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల్లో లాక్కున్నారని ఆక్షేపించారు. వాహన మిత్ర సొమ్మును పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దోచేశారని దుయ్యబట్టారు. ఆదాయం సృష్టించడం చేతకాక.. ఇలా సామాన్యులపై భారం మోపటమేమిటని ఆమె ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details