ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలు: వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ - AP Politics Latest news

పంచాయతీ ఎన్నికలు జరిగిన తీరును పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఎక్కడైనా అనునాస్పద, వివాదాస్పద అంశాలు, లోపాలను గుర్తిస్తే.. వెంటనే సంబంధింత జిల్లా కలెక్టర్లకు సమాచారాన్ని చేరవేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలు: వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
పంచాయతీ ఎన్నికలు: వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

By

Published : Feb 21, 2021, 4:57 PM IST

పంచాయతీ ఎన్నికలు: వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

నాలుగో దఫా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తీరును పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో కమిషనర్ గిరిజాశంకర్ సహా... ఆ శాఖ ఉన్నతాధికారులు కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగిన తీరును సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అనునాస్పద, వివాదాస్పద అంశాలు, లోపాలను గుర్తిస్తే వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్లకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. నిరంతరం మీడియా ఛానళ్లలో వచ్చిన సమాచారాన్ని తెలుసుకుంటూ... అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పోలింగ్ వివరాలను నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details