రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పురపాలక ఎన్నికల నామినేషన్ల పరిశీలనను అధికారులు చేపట్టనున్నారు. రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో నామినేషన్ల పర్వం ముగిసింది. మూడురోజుల్లో మొత్తం 6వేల 563 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. తెదేపా-1,675, వైకాపా-2,307, జనసేన 386, ఇతర పార్టీలు-62, స్వతంత్రులు - 1,230, ఐఎన్సీ - 290, ఎన్సీపీ - 1, బీఎస్పీ-33, భాజపా-345, సీపీఐ 88, సీపీఎం-146.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నామినేషన్ల పరిశీలన
రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇవాళ నామినేషన్ల పరిశీలనను అధికారులు చేపట్టనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6వేల 563, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో 12వేల 86 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ల
రాష్ట్రంలోని 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో మూడు రోజులుగా 12,086 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఎస్పీ-27, భాజపా-554, సీపీఐ-104, సీపీఎం-110, ఐఎన్సీ-168, ఎన్సీపీ-87, తెదేపా-3,610, వైకాపా-5,452, జనసేన-434, ఇతర పార్టీలు-122, స్వతంత్రులు-1418.