ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'144 సెక్షన్ అమల్లో ఉంది.. ఎవరూ బయటకు రావొద్దు' - మందడంలో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. మందడం గ్రామ వీధుల్లో  సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని మైకులో చెబుతూ.. వందలాది మంది పోలీసులు కవాతు చేస్తున్నారు.

number of police parade in mandadam village
మందడంలో పోలీసుల ఆంక్షలు

By

Published : Jan 12, 2020, 9:39 AM IST

మందడంలో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైతులు ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మందడం గ్రామ వీధుల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని మైకులో చెబుతూ.. వందలాది మంది పోలీసులు కవాతు చేస్తున్నారు. ఆంక్షల దృష్ట్యా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, గుమికూడవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మందడం రోడ్డుపై రైతులు టెంటు వేసేందుకు అనుమతి నిరాకరించారు. గ్రామంలోని ప్రైవేటు స్థలంలో టెంటు వేసి శాంతియుత ధర్నా చేసేందుకు రైతుల ప్రయత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details