మెడికల్ సైన్సెస్ సబ్జెక్టుల్లో పరిశోధనలపై విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) మధ్య ఒప్పందం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం అవసరం లేకుండా విశ్వవిద్యాలయం ద్వారా పీహెచ్‌డీలో ప్రవేశాలు జరిగాయి. రాష్ట్ర విభజనతో అధికారికంగా అనివార్యమైన ఒప్పందం... ఐదేళ్ల వ్యవధితో రెండు సంస్థల మధ్య జరిగింది. బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, పౌష్ఠికాహారం, నీటిలో ఉండే భారలోహాలు, ఫ్లోరైడ్ లెవెల్స్ వంటి వాటిని విద్యార్థులు కనుగొనేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. పూర్తిస్థాయిలో నిర్ణయాలు జరిగిన తర్వాత విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశాల ప్రకటన ఇస్తుంది. విశ్వవిద్యాలయం ఎన్‌ఐఎన్‌ను పరిశోధన కేంద్రంగా ప్రకటించాక ఎన్‌ఐఎన్‌లో పనిచేసే ఆచార్యులను గైడ్స్‌గా గుర్తిస్తారు. అనంతరం విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి, పీహెచ్‌డీలో ప్రవేశాలను విశ్వవిద్యాలయం ఖాయం చేస్తుంది. 2011 నుంచి విశ్వవిద్యాలయంలో మెడికల్, డెంటల్, ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి, యునాని, నర్సింగ్, ఫిజియోథెరపీ విభాగాల్లో విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్‌ఐఎన్‌తో ఒప్పందం ద్వారా రాష్ట్ర విద్యార్థులకు మెడికల్ సైన్సెస్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు మార్గం సుగమమైంది. దీనివల్ల పరిశోధన చేసే విద్యార్థుల నుంచి మంచి స్పందన కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ శ్యాంప్రసాద్ వెల్లడించారు.
ఎన్‌ఐఎన్‌లో ఉండే సౌకర్యాలతో...