ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MLC Elections: 11 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యూల్ - ఏపీ వార్తలు

MLC Elections
MLC Elections

By

Published : Nov 9, 2021, 12:21 PM IST

Updated : Nov 9, 2021, 1:38 PM IST

12:15 November 09

ఎమ్మెల్యే కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్

స్థానిక సంస్థల కోటాలోని 11 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ స్థానాల భర్తీకి ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 23 చివరి తేదీ కాగా.. ఉపసంహరణకు ఈనెల 26వ తేదీని గడువుగా నిర్ణయించారు. డిసెంబర్​ 10న  ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్ 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

జిల్లాల్లోని స్థానాలు ఇలా..

అనంతపురం, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, తూ.గో, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఇక గుంటూరు జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఎమ్మెల్యే కోటాలోని స్థానాలకు నోటిఫికేషన్

రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ (notification issued for 3 MLC seats in ap news) అయింది. ఎమ్మెల్యే కోటాలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరించి.. 17వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 

నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ మధ్యాహ్నం 3 వరకు గడువు ఇచ్చారు. ఈ నెల 29 తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి సుబ్బారెడ్డిని నియమిస్తూ ఈసీ(ఎన్నికల కమిషన్) ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

అనంతపురంలో విద్యాసంస్థల బంద్.. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట

Last Updated : Nov 9, 2021, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details