ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా నమోదు కాని కరోనా కేసులు - ఏపీలో కరోనా కేసులు

రాష్ట్రంలో ఇవాళ కరోనా పాజిటివ్‌ కేసులేవీ నమోదు కాలేదని ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఎవరికీ కరోనా సోకలేదని వెల్లడించింది. మొత్తం 217 నమూనాలు పరీక్షించాక అన్నీ నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించింది.

no cases in ap
no cases in ap

By

Published : Apr 9, 2020, 11:42 AM IST

రాష్ట్రంలో నిన్నటివరకు 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కర్నూలులో 75, గుంటూరు జిల్లాలో 49, నెల్లూరు జిల్లాలో 48 , కృష్ణా జిల్లాలో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలో 27 , పశ్చిమ గోదావరి జిల్లాలో 22, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో 20 పాజిటివ్ కేసులు చొప్పున నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 11 కేసులు నిర్థారించారు .ఇప్పటివరకూ నలుగురు మృతి చెందగా..9 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. అయితే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకూ 217 నమూనాలు పరీక్షించగా అన్నీ నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్క కరోనా పాజిటివ్‌ కేసూ నమోదు కాలేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details