ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధ సంత్సరానికి పాత విధానం ప్రకారమే పన్నుల వసూళ్లకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా వార్షిక పన్ను మొత్తం చెల్లిస్తే 5% రాయితీ కూడా ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఏప్రిల్ నుంచి పన్నులు విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పుర ఎన్నికలకు ముందే ప్రత్యేక అధికారులు ఆమోదించి తీర్మానాలు చేశారు. పాలకవర్గాలు కొలువుదీరిన వేళ కొత్త పన్ను విధానాన్ని పురపాలకశాఖ తాత్కాలికంగా పక్కన పెట్టింది.
పలు కారణాలతో గత నెలలో ఎన్నికలు నిర్వహించని మూడు నగరపాలక సంస్థలు, 32 పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన మేయర్లు, పుర ఛైర్మన్ల రాష్ట్రస్థాయి సదస్సులో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత విధానంలోనే పన్నులు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక తాఖీదుల జారీయే ఆలస్యం