ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2020, 5:31 PM IST

ETV Bharat / city

'పీపీఈ కిట్ల కొనుగోళ్లలో రూ.30 కోట్ల అవినీతి'

రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి వైకాపా పాలనా వైఫల్యమే కారణమని తెదేపా నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థతో రేషన్ సరఫరా ఎందుకు చేయలేకపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు.

తెదేపా నేత నిమ్మల రామానాయుడు
తెదేపా నేత నిమ్మల రామానాయుడు

రాష్ట్రంలో కరోనా విజృంభించడానికి వైకాపా పాలనా వైఫల్యమే కారణమని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైకాపా నేతలే ర్యాపిడ్ టెస్ట్ కిట్​లతో పరీక్షలు చేసుకుని ఎక్కువగా పరీక్షలు చేస్తున్నామని చెబుతున్నారని విమర్శించారు. వాలంటీర్ల వ్యవస్థను పెట్టుకుని ఉచితంగా నిత్యావసర సరకులు, రేషన్​ సరకులు ఇంటింటికీ ఎందుకు అందించలేక పోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వద్ద ఆదాయం ఉన్నా.. పేదవారికి సాయం చేయడం లేదని రామానాయుడు అన్నారు. మనుషుల ప్రాణాల కంటే అవినీతికే వైకాపా ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. వైకాపా నేతలు టెస్టింగ్ కిట్లలో రూ.30 కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. పేదల ఇళ్ల స్థలాల పేరుతో భూ దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పీపీఈ కిట్లు, మందుల కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని రామానాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి 10 వేలు ఆర్థిక సాయం చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details