తెలంగాణలో కఠిన ఆంక్షలు విధించినా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడట్లేదు. గడిచిన 24 గంటల్లో 63,120 కరోనా పరీక్షలు నిర్వహించగా... 3,308 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కరోనా మహమ్మారికి మరో 21 మంది బలయ్యారు. మరోవైపు కరోనా నుంచి మరో 4,723 మంది బాధితులు కోలుకున్నారు.
తెలంగాణలో కొత్తగా 3,308 కరోనా కేసులు.. 21 మరణాలు - కరోనా వ్యాప్తి
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 63,120 కరోనా పరీక్షలు నిర్వహించగా... 3,308 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. కరోనా మహమ్మారికి మరో 21 మంది బలయ్యారు.
telangana corona cases
ప్రస్తుతం 42,959 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 513 కరోనా కేసులు నమోదు కాగా.. ఖమ్మం జిల్లాలో 228, రంగారెడ్డి జిల్లాలో 226, మేడ్చల్ జిల్లాలో 203, కరీంనగర్ జిల్లాలో 161 కరోనా కేసులు నమోదయ్యాయి.