రాష్ట్రంలో కొత్తగా 16 వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 71,152 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,628మందికి పాజిటివ్ వచ్చింది. ఫలితంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,41,724కు చేరింది. మరోవైపు 2,744మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,05,000 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
ap corona cases: కొత్తగా 1,628 కరోనా కేసులు, 22 మరణాలు - ఏపీలో కరోనా మరణాలు
17:12 July 19
ap corona cases
తాజాగా కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ 22 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందగా, కృష్ణాలో నలుగురు, గుంటూరు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మృతుల సంఖ్య 13,154కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్ కేసులున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి
RRR: ఆ రూమర్ నిజం కాదు.. స్పీకర్ను కలిసి వివరణ ఇస్తా: ఎంపీ రఘురామ