JAGAN-SAMEER SHARMA: సీఎం జగన్‌ను కలిసిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ - New CS Sameer Sharma meet CM jagan
15:43 September 13
VJA_New CS Sameer Sharma meet CM_Breaking
రాష్ట్రానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎంతో కాసేపు సమావేశమయ్యారు. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండగా.. ఆయన స్ధానంలో తదుపరి సీఎస్‌గా డాక్టర్ సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా, రిసోర్స్ మొబలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: