బెంజ్ మినిస్టర్ జయరామే ఈఎస్‌ఐ స్కామ్ వెనక ఉన్న అసలైన సూత్రధారి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పనులు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కార్మిక శాఖ మంత్రి జయరామ్ మాత్రం ఈఎస్ఐ స్కామ్‌లో నిందితుడు ఇచ్చిన బెంజ్ కారులో విలాసంగా తిరుగుతున్నారని విమర్శించారు. బెంజ్ మినిస్టర్ జయరాం అంటూ.. ఓ వీడియోను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
'ఈఎస్‌ఐ స్కామ్ వెనక అసలైన సూత్రధారి ఆయనే'
మంత్రి జయరామ్‌పై తెదేపా ముఖ్య నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈఎస్‌ఐ స్కామ్ వెనక ఉన్న అసలైన సూత్రధారి ఆయనే అని లోకేశ్ ట్వీట్ చేశారు. నిందితుడు ఇచ్చిన బెంజ్ కారులోనే తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.
నారా లోకేశ్