రాజధాని విభజన నిర్ణయం గొప్పదే అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు భయపడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను ఎందుకు గృహ నిర్బందం చేస్తున్నారని నిలదీశారు. తెదేపా నాయకులు చేసిన తప్పేంటని అడిగారు.శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని కాలరాసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని మండిపడ్డారు. గ్రామాల్లో పోలీసు లాఠీలు, ముళ్ల కంచెలతో ఉద్యమాన్ని అణిచివేయడం సాధ్యం కాదని చెప్పారు. వైకాపా ప్రభుత్వం ఎంత తొక్కాలి అనుకుంటే అంతకి పదింతలు ఉద్యమం ఉద్ధృతం అవుతుందని స్పష్టం చేశారు.
'తెదేపా నాయకులు చేసిన తప్పేంటి?'
అసెంబ్లీ ముట్టడికి అమరావతి ఐకాస పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బందం చేస్తున్నారు. ఈ చర్యలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కుని కాలరాసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
nara lokesh respond on tdp leaders house arrest