జీవో 142 తెచ్చి పాత్రికేయులకు ఉన్న ఒకే ఒక సౌకర్యం అక్రిడిటేషన్ కార్డులు తీసేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డుల్లో 10 శాతం కూడా ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతగా ఉందని అన్నారు. జీవోని అడ్డుపెట్టుకుని తన మీడియా వారికే అక్రిడేషన్లు ఇచ్చారని ఆరోపించారు. జీవో నెంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ కార్డులు జర్నలిస్టుల హక్కు అని, పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి' - nara lokesh on journalists accredations
జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. జీవో 142 తెచ్చి పాత్రికేయులకు ఉన్న ఒకే ఒక సౌకర్యం అక్రిడిటేషన్ తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
nara lokesh on media accreditations