వైకాపా ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో రోజుకో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. కర్షకులకు జాతీయ రైతు దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన... ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చరణ్‌సింగ్ జయంతిన జరపాల్సిన జాతీయ రైతు దినోత్సవాన్ని వైఎస్ జయంతిన నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
రైతుల భవిష్యత్తును అంధకారం చేసేందుకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు. సర్కార్ విధానాలతో రోజుకో అన్నదాత ఆత్మహత్యకి పాల్పడటం ఆవేదనకు గురిచేస్తోంది. కట్టేవి కూలగొట్టడం, వీలుకాకుంటే రంగులేయడం, అదీ సాధ్యం కాకపోతే స్టిక్కర్లు అంటించడం మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసు. ప్రభుత్వ సాయం కోసం పొలాల్లో రైతులు ఎదురుచూస్తుంటే వ్యవసాయ శాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నారు. కర్షకులకు న్యాయం జరిగేలా పోరాడటానికి నేను ముందు ఉంటాను- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి