అనంతపురం జిల్లాలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కనీసం మాస్కులు, ఇతర అవసరాలు అందించని కారణంగానే వారు కరోనా బారిన పడ్డారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి వ్యక్తిగత రక్షణ కిట్లు అందించటంలో జగన్ ప్రభుత్వం విఫలమైందనటానికి అనంతపురం జిల్లానే ఓ ఉదాహరణ అన్నారు. ఈ అంశాలపై ప్రశ్నించిన కొందరు వైద్యులను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఉద్యోగాలు పోతాయనే భయంతో ఎవ్వరూ నోరు మెదపని పరిస్థితిని అధికార పార్టీ తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం కరోనాపై ముందుండి పోరాడుతున్న ప్రభుత్వ వైద్య సిబ్బందికి తక్షణమే వ్యక్తిగత రక్షణ కిట్లు అందజేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యానికి అనంతపురం జిల్లానే ఉదాహరణ: లోకేశ్ - ఏపీలో కరోనా కేసుల వార్తలు
కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి కనీసం వ్యక్తిగత రక్షణ కిట్లు అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
nara lokesh