ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

షేర్​చాట్​ కోసం బాలుణ్ని చంపేశాడు... కిడ్నాప్ డ్రామా ఆడి దొరికిపోయాడు... - Boy died in Shamirpet

అప్పటి దాకా సరదా ఆడుకుంటున్న ఆ బాలుడిని... షేర్​చాట్​ వీడియో రూపంలో మృతువు పలకరించింది. తెలిసిన వ్యక్తి , వీడియో చెద్దాం రా...అని పిలిస్తే సంతోషంగా వెళ్లాడు. కాని అంతలోనే ప్రమాదవశాత్తు కింద పడి గాయాలయ్యాయి. ఇది గమనించిన ఆ వ్యక్తి... బాలుని తల్లిదండ్రులు తనని ఏం చేస్తారో అనే భయంతో... మెుత్తంగా ఆ చిన్నారి ఆయువు తీసేసి ఆనవాలు లేకుండా చేశాడు. తిరిగి కిడ్నాప్ గా సృష్టించాలని ప్రయత్నించి దోరికిపోయాడు.

murder of a kidnapped
బాలుడి పాలిట శాపంగా మారిన షేర్​చాట్​ వీడియో

By

Published : Oct 26, 2020, 5:59 PM IST

బాలుడి పాలిట శాపంగా మారిన షేర్​చాట్​ వీడియో

సరదా కోసం తీసుకుంటున్న షేర్​చాట్​ వీడియో ఆ బాలుడి పాలిట శాపంగా మారింది. ఆడుకుంటానని బయటికి వెళ్లిన ఐదేళ్ల అభియాన్‌ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు చుట్టుపక్కలా అంతా వెతికారు. లాభం లేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించారు. అభియాన్‌ను చంపేసిన వ్యక్తి... ఘటనను కిడ్నాప్‌గా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. కుమారుడి మరణావార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

విషాదం...

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో అదృశ్యమైన ఐదేళ్ల బాలుడు అభియాన్‌ ఘటన విషాదాంతమైంది. ఈనెల 15న ఆడుకోవడానికి బయటికి వెళ్లి తిరిగిరాకపోవడం వల్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు... శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌రోడ్డు పక్కన అభియాన్‌ మృతదేహాన్ని గుర్తించారు. బాలుడు ఉంటున్న ఇంట్లోనే అద్దెకు ఉంటున్న బిహార్‌ వాసి సుదర్శన్‌ శర్మ హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు.

వీడియో తీసే క్రమంలో...

బిహార్‌కు చెందిన సుదర్శన్‌ శర్మ... నెలరోజులుగా అభియాన్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈనెల 15న షేర్‌చాట్‌ వీడియోలు చిత్రీకరించేందుకు బాలుడిని పిలిచాడు. వీడియో తీసే క్రమంలో అభియాన్ భవనంపై నుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. అభియాన్‌ తల్లిదండ్రులు కొడతారని భయపడ్డ సుదర్శన్‌... బాలుడ్ని చంపేసి సంచిలో పెట్టుకుని బాహ్యవలయ రహదారి వద్ద పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఫోన్​ కాల్ ఆధారంగా...

తర్వాత ఇంటి యజమానికి ఫోన్‌ చేసి రూ. 15 లక్షలు ఇస్తే బాలుడిని వదిలేస్తామని బెదిరించాడు. ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. సుదర్శన్‌ ఇచ్చిన సమాచారంతో ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లిన పోలీసులకు బాలుడి అస్థికలు, దుస్తులు కనిపించాయి. ఘటనాస్థలిలో అభియాన్‌ అస్థికలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని తల్లిదండ్రులకు అప్పగించారు. వాటిలో కొన్ని ఎముకలను డీఎన్​ఏ పరీక్షకు పంపినట్లు తెలిపారు.

ఇవీచూడండి:కేసుల మాఫీ కోసం పోలవరం తాకట్టు పెట్టారు: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details