ఎంపీ విజయసాయిరెడ్డికి విదేశీ పర్యటనకు అనుమతివ్వడం సమంజసం కాదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తీరప్రాంతాల్లో అధ్యయనానికి వెళ్తున్నానని విజయసాయిరెడ్డి అన్నారన్న రఘురామ.. విశాఖ తీరప్రాంతం ఎంతవరకు బాగుపడుతుందో చూద్దామని ఎద్దేవా చేశారు.
RRR: 'ఎంపీ విజయసాయి విదేశీ పర్యటనకు అనుమతి సరికాదు' - ap news updates
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి విదేసీ పర్యటనకు అనుమతివ్వడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తాను విదేశాలకు పారిపోతానని ప్రచారం చేసినవాళ్లు.. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారో గ్రహించాలని అన్నారు.
MP RRR
నేనేదో విదేశాలకు పారిపోతానని ప్రచారం చేశారు.. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు. వారి మనసులో ఉన్న విషయాలను అందరికీ ఆపాదిస్తున్నారు. కోర్టు తీర్పు రాకముందే కొన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారు.- ఎంపీ రఘురామకృష్ణరాజు