ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

షర్మిలమ్మ పార్టీ కేవలం ఓట్ల చీలిక కోసం కుట్ర: రేవంత్ రెడ్డి - ys sharmila news

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా పోల్కంపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో షర్మిలమ్మ పార్టీ కేవలం ఓట్ల చీలిక కోసం చేసే కుట్రని ఆయన ఆరోపించారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారు ఇక్కడ పార్టీ పెడతా అంటే ఎవరూ ఆదరించరని అన్నారు.

revanth fired on sharmila in telangana
షర్మిలమ్మ పార్టీ కేవలం ఓట్ల చీలిక కోసం చేసే కుట్రే: రేవంత్ రెడ్డి

By

Published : Feb 9, 2021, 10:52 PM IST

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టాలనే నిర్ణయం జగన్ అన్నది కాదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ది అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడి ప్రజల ఓట్ల చీలిక కోసమే రాష్ట్రంలో మరో కుట్ర జరుగుతోందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ జెండా పాతాలంటే పోతిరెడ్డిపాడు, సంగంబండ, కృష్ణా జలాలపై వారి వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డగా వస్తే అపురూపంగా చూసుకుంటామని... ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తే ఎదురు తిరుగుతామన్నారు.

షర్మిలమ్మ పార్టీ కేవలం ఓట్ల చీలిక కోసం చేసే కుట్రే..

పోతిరెడ్డిపాడు, కృష్ణా జలాల మీద న్యాయస్థానాల్లో వేసిన కేసులను ఏపీ సీఎం జగన్ ఉపసంహరించుకోవాలని రేవంత్ అన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినవారు ఇక్కడ పార్టీ పెడతా అంటే ఎవరూ ఆదరించరని పేర్కొన్నారు. షర్మిలమ్మ పార్టీ పెడతానంటే కేసీఆర్ నోరు మెదపకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని సూచించారు.

రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని రేవంత్ డిమాండ్ చేశారు. నూతన సాగు చట్టాలను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ప్రగతి భవన్​లో ఇటీవల నిర్వహించిన సమావేశం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదని... కేవలం తండ్రీ కొడుకుల ముఖ్యమంత్రి పంచాయితీ కోసమేనని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

'తెలంగాణ సీఎం అభ్యర్థిగా వైఎస్​ షర్మిల!'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details