ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు (governors), లెఫ్టినెంట్ గవర్నర్ల(lieutenant governors)కు ఎంపీ రఘురామ కృష్ణరాజు(mp raghurama krishnam raju) లేఖ రాశారు. త్వరలో గవర్నర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో.. సెక్షన్ 124ఏ (section 124-A) రాజద్రోహం కేసు(sedition case)ను పూర్తిగా రద్దు చేసే విషయంపై సదస్సులో చర్చించాలని రఘురామ కోరారు.
mp raghurama: అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఎంపీ రఘురామ లేఖ
15:03 June 08
mp raghu rama krishnam raju
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలు ఎత్తి చూపినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిన విషయాన్ని రఘురామ గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేస్తే... సీఎం జగన్(CM jagan) వ్యక్తిగత కక్ష పెంచుకుని అక్రమ కేసులు బనాయించేలా చేశారని లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఐడీ(AP CID) పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. అక్రమంగా తనను అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించారని తెలిపారు. అరెస్టు చేసిన రోజే సీఐడీ కార్యాలయంలో అత్యంత క్రూరంగా హింసించారని.. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు వ్యక్తులు.. లాఠీలు, రబ్బరు బెల్టులతో చిత్రహింసలకు గురి చేశారని లేఖలో ప్రస్తావించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం నేరం మోపడమేగాక.. హింసించడం ఇదే తొలిసారి అని రఘురామ వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి (president of india) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే గవర్నర్ల సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తి.. తనకు మద్దతుగా నిలవాలని గవర్నర్లకు, లెఫ్టినెంట్ గవర్నర్లకు రఘురామ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి
mp raghu rama letter: రాజద్రోహం సెక్షన్ల రద్దుకు మద్దతివ్వండి: ఎంపీ రఘురామ