రాష్ట్రంలో అత్యధికంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు విశాఖ జిల్లాలో జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వరకు 1,02,460 పరీక్షలు జరిగాయి. ఇందులో గరిష్ఠంగా విశాఖ జిల్లాలోనే 13,466 మందిని పరీక్షించినట్లు జిల్లాలవారీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాలో 25 పాజిటివ్ కేసులు వచ్చాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 411 పాజిటివ్ కేసులు నమోదైన కర్నూలు జిల్లాలో 8,468 మందిని పరీక్షించారు. గుంటూరు జిల్లాలో గరిష్ఠంగా 97 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో.. లక్ష దాటిన కరోనా పరీక్షలు - More than one million corona tests statewide
రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు లక్ష దాటాయి. ఇందులో అత్యధికంగా విశాఖ జిల్లాలో జరిగాయని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా లక్ష దాటిన కరోనా పరీక్షలు