Financial Problems in GHMC: ఒకటో తేదీ వస్తోందంటే జీహెచ్‌ఎంసీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొదటి వారానికల్లా ఉద్యోగుల జీతభత్యాల కింద రూ.130 కోట్లు, చెత్త తరలింపు వాహనాలు ఇతరత్రా నిర్వహణకు రూ.100 కోట్ల పైబడే విడుదల చేయాల్సి వస్తోంది. డబ్బులు లేక ఇటు పనులు ఆపుకోవాలా లేక ఇంక వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలా అనే ఆలోచనలు పడింది.
అభివృద్ధి పనులు ఆపేసి..నిధుల్లేక వేతన చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. తమకు రూ.800 కోట్ల మేర బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో ఈనెల 15 నుంచి సమ్మెకు దిగినట్లు గుత్తేదారుల సంఘం ప్రకటించింది. దీంతో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సెప్టెంబరు వరకు రూ.450 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా గత నెలలో రూ.100 కోట్లు విడుదల చేశామని అధికారులు తెలిపారు.