రాష్ట్ర ప్రజలకు ప్రాణాధారమైన రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ విషం కక్కుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. వైకాపా ఆరోపిస్తున్నట్లు రాజధాని ఏర్పాటు తర్వాత జరిగిన లావాదేవీల్లో అవినీతిని నిరూపించలేకపోయారని పేర్కొన్నారు. మంత్రులు చేస్తున్న ఆరోపణలు, డ్రామాలు చూస్తుంటే... అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. వైకాపా ప్రభుత్వానికి హడావుడి ఎక్కువ... విషయం తక్కువ అని ఎద్దేవా చేశారు.
'వైకాపాకు విషయం తక్కువ... హడావుడి ఎక్కువ' - TDP MLC
అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందని... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్