ఆశావాహుల్లో ఉత్కంఠ - tdp
రేపటితో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ నామినేష్ల దాఖలుకు గడువు ముగుస్తున్నా.. ఇంకా అభ్యర్ధుల ఎంపికలో స్పష్టత రాలేదు. తెదేపా ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా ఎమ్మెల్సీ ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల నామినేషన్ల దాఖలుకు రేపటితో గడువు ముగుస్తున్నా... ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. సార్వత్రిక ఎన్నికలు, అసంతృప్తులను అంచనావేసుకుంటూ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు జరుగనుంది. ఆర్థికమంత్రి యనమలకు మరోసారి అవకాశం ఇవ్వనున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబం నుంచి ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు పేరు పరిశీలనలోకి తీసుకోనున్నారు.