ఒక పక్క ఈఎస్ఐ స్కామ్‌పై విచారణ జరుగుతుంటే... ఈ కేసులో ఏ-14గా ఉన్న కార్తీక్‌కి బిల్లులు ఎలా రిలీజ్ అయ్యాయని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ప్రశ్నించారు. మంత్రి జయరామ్ విజయవాడ వస్తే ఆయన ఉండడానికి, విలాసాలకు అయ్యే ఖర్చు కార్తీక్ ఎందుకు భరించాడని నిలదీశారు. ఖరీదైన బెంజ్ కారుని మంత్రి కొడుకు ఈశ్వర్‌కి కార్తీక్ బర్త్ డే గిఫ్ట్‌గా ఎందుకు ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. స్కామ్ వెనుక ఉన్న బెంజ్ మినిస్టర్ జయరామ్ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పేకాట కింగ్, ల్యాండ్ గ్రాబర్, ఈఎస్ఐ స్కామ్ స్టార్ జయరామ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గుమ్మనూరు గూడుపుఠాణి పేరిట ఓ వీడియోను మంతెన ట్విట్టర్‌లో విడుదల చేశారు.
'ఏ-14గా ఉన్న కార్తీక్‌కి బిల్లులు ఎలా రిలీజ్ అయ్యాయి..?' - ESI Scam in ap news
ఈఎస్ఐ స్కామ్‌లో ఏ-14గా ఉన్న కార్తీక్‌కి బిల్లులు ఎలా రిలీజ్ అయ్యాయని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ప్రశ్నించారు. స్కామ్ వెనుక ఉన్న బెంజ్ మినిస్టర్ జయరామ్ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
'ఏ-14గా ఉన్న కార్తీక్‌కి బిల్లులు ఎలా రిలీజ్ అయ్యాయి..?'