ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేశ చరిత్రలో ఇదే ప్రథమం: బొత్స - Panchayat Secretary results

మేనిఫెస్టోలో చెప్పినట్లు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో చిన్న లోపం కూడా తలెత్తలేదని వివరించారు. ఈ దిశగా ప్రభుత్వ అధికారులు చాలా కష్టపడ్డారని కితాబిచ్చారు.

బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

By

Published : Sep 19, 2019, 4:35 PM IST

బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోనే గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీ చేశామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటి వద్దకు చేర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇంత త్వరగా పూర్తి చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినా చిన్న లోపం కూడా తలెత్తలేదని వివరించారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ అధికారులు చాలా కష్టపడ్డారని కితాబిచ్చారు.

ఈ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది: పెద్దిరెడ్డి

దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలు త్వరగా పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేందుకే గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామన్న పెద్దిరెడ్డి... ఈ ఘనత అంతా సీఎం జగన్‌కే దక్కుతుందని చెప్పారు. ఇంత తక్కువ కాలంలో ఉద్యోగాల భర్తీ దేశంలోనే రికార్డని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

గవర్నర్‌తో చంద్రబాబు భేటీ... ప్రభుత్వంపై ఫిర్యాదు....

ABOUT THE AUTHOR

...view details