Meeting on CPS: సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడి నేపథ్యంలో ఉద్యోగులతో మంత్రులు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో మంత్రులు బుగ్గన, బొత్స పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు చేసే అంశంపై మాత్రమే చర్చిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. జీపీఎస్ ప్రతిపాదనపై ప్రభుత్వం ఆలోచన చేయనుంది. సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడి కార్యక్రమాలను విరమింపజేసుకోవాలని మంత్రులు బుగ్గన, బొత్స కోరారు.
MINISTER BOTSA ఏపీ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్‌తో నిన్న(గురువారం) విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. 'చలో విజయవాడ', మిలియన్ మార్చ్ కార్యక్రమం వాయిదా వేసుకోవాలని ఉద్యోగ సంఘాలను కోరారు. ఉద్యోగ సంఘాల నిరసనల నేపథ్యంలో ఏపీసీపీఎస్ఈఏ ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్లపై పోలీసుల నిఘా పెట్టారు. ఇవాళ ఈ రెండు సంఘాలతో ఆర్థిక మంత్రి సహా మంత్రుల సంప్రదింపుల కమిటీతో మరోసారి భేటీ కానున్నారు.
Bandi Srinivasa Rao on CPS: పాలకులు సెప్టెంబరు 1న సీపీఎస్ తీసుకువచ్చారని.. అప్పటినుంచి సెప్టెంబరు 1ని విద్రోహ దినంగా పాటిస్తున్నామని ఏపీఎన్జీవో అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. సెప్టెంబరు 1న 26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు తెలుపుతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయటం లేదని ఆయన మండిపడ్డారు. మినిమం స్కేల్ ఇచ్చినా.. సర్వీసు రెగ్యులరైజ్ చేయలేదని, తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఏపీ ప్రభుత్వం కుడా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ఏపీజేఏసీ ప్రధాన కార్యదర్శి హృదయరాజు గుర్తు చేశారు. జీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు ఉపయోగం లేదన్నారు. రాజస్థాన్, చత్తీస్‌ఘర్‌లలో అక్కడి ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దు చేశాయని, అక్కడి రిపోర్ట్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం కూడా స్పందించాలన్నారు. ఉద్యోగులపై పెట్టిన కేసులు పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ సంగతి:కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని (సీపీఎస్) రద్దు చేయాలనే డిమాండ్‌తో సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1న సీపీఎస్ ఉద్యోగుల సంఘం (సీపీఎస్‌యూఎస్) సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. మరోవైపు సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (సీపీఎస్‌ఈఏ) విజయవాడలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అయినా ఆందోళనలు కొనసాగించాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతుండగా.. అడ్డుకోవడానికి పోలీసులు అడుగడుగునా నిర్బంధాలు మొదలుపెట్టారు. ఆందోళనలను వాయిదా వేయించేందుకు సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు చర్చలు జరుపుతున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏపీసీపీఎస్‌యూఎస్ ఉద్యోగ నాయకులతో రెండు గంటలపాటు చర్చించారు. సీపీఎస్, జీపీఎస్, ఓపీఎస్ విధానంలో ఉన్న తేడాలను నాయకులు మంత్రికి వివరించారు. సీపీఎస్‌ఈఏను చర్చలకు ఆహ్వానించగా ఓపీఎస్‌పై తప్ప, జీపీఎస్‌పై మాట్లాడేందుకు తాము రాబోమని తిరస్కరించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి శుక్రవారం మరోసారి చర్చలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి