ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SABITHA: జగన్​ అక్రమాస్తుల కేసులో సబిత డిశ్చార్జ్​ పిటిషన్​

జగన్​ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ కేసు నుంచి తనను తొలగించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది.

జగన్​ అక్రమాస్తుల కేసులో సబిత డిశ్చార్జ్​ పిటిషన్​
జగన్​ అక్రమాస్తుల కేసులో సబిత డిశ్చార్జ్​ పిటిషన్​

By

Published : Jul 6, 2021, 8:46 PM IST

జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల శాఖ మంత్రిగా ఉన్న తనను పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్​లో సీబీఐ అనవసరంగా ఇరికించిందని పిటిషన్​లో మంత్రి పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. అంగీకరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

పెన్నా ఛార్జ్ షీట్​లో విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్​పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. శామ్యూల్​ను కేసు నుంచి తొలగించవద్దని సీబీఐ కోరింది. తనను కేసు నుంచి తొలగించాలని కోరుతూ శామ్యూల్​ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై వి.డి.రాజగోపాల్ వాదనలు వినిపించారు. పయనీర్ హాలిడే రిసార్ట్స్, పీఆర్ ఎనర్జీ కంపెనీల డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలు కోసం సీబీఐ గడువు కోరింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్​కు సంబంధించిన అన్ని అంశాలపై విచారణను న్యాయస్థానం ఈనెల 13కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details