ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజాబలం లేకనే దొంగ ఓట్లు అంటూ ఆరోపణలు: మంత్రి పెద్దిరెడ్డి - తెదేపా నేతలపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

తెదేపా నేతలపై మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రజాబలం లేకే దొంగ ఓట్లు అంటూ వైకాపాపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతల వైఖరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

minister peddireddy
tirupati election polling

By

Published : Apr 17, 2021, 12:11 PM IST

Updated : Apr 17, 2021, 3:20 PM IST

మంత్రి పెద్దిరెడ్డి

ప్రజాబలం లేకనే దొంగ ఓట్లు అంటూ తెదేపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాను నేరుగా ఎదుర్కోలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రణాళికబద్ధంగానే దొంగ ఓట్ల నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. పుణ్యక్షేత్రమైన తిరుపతికి ఎక్కడెక్కడ్నుంచో భక్తులు వస్తుంటారన్న ఆయన.. బస్సుల్లోని ప్రయాణికులపై దొంగ ఓటర్లు అనే ముద్ర వేస్తున్నారని చెప్పారు.

‘‘నారా లోకేశ్‌ నన్ను వీరప్పన్‌గా ట్వీట్‌ చేశారు. రాజకీయ లబ్ధికోసం ఏదంటే అది మాట్లాడితే ఉపేక్షించం. కిరణ్‌ కుమార్‌రెడ్డితో కలిసి తెదేపా వాళ్లే ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేశారు. నన్ను స్మగ్లర్‌గా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. తెదేపా తీరు చాలా అభ్యంతరకరం. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపాను ఎదుర్కోలేక ముందుగా ప్రణాళిక రచించి దారుణాలు చేస్తున్నారు. తెదేపాకే ప్రజాబలం ఉందా? వైకాపాకి ప్రజా బలం లేదా?. ఫలితాల రోజు తెలుస్తుంది.. ఎవరికి ప్రజాబలం ఉందో. తిరుపతి యాత్రా స్థలం కావడంతో ప్రైవేటు బస్సులు వస్తాయి. ఆ బస్సులు వైకాపావిగా చిత్రీకరించడం దారుణం. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుంటే ఎన్నికల్లో కొనసాగుతారు. లేదంటే ఇవే చంద్రబాబుకు చివరి ఎన్నికలు’’ అని పెద్దిరెడ్డి అన్నారు.

Last Updated : Apr 17, 2021, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details