ముఖ్యమంత్రులుగా పనిచేసినా.. సొంత జిల్లా చిత్తూరుకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిందేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సత్యవేడులో నిర్వహించిన వైకాపా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశం దృష్టిని ఆకర్షించేలా అత్యధిక మెజార్టీతో ఉపఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి.. కోరారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డి చేసిందేమీ లేదు: మంత్రి పెద్దిరెడ్డి - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజా వార్తలు
తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి కోరారు. సీఎంలుగా పని చేసినా... సొంత జిల్లా చిత్తూరుకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు.
minister peddireddy comments on chandraba