ఇసుకను అక్రమంగా తరలిస్తే రెండేళ్ల జైలు శిక్ష పడే విధంగా నూతన చట్టాన్ని తీసుకువస్తున్నట్లు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం రొయ్యూరులో ఇసుక విక్రయ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం విజయవాడలోని పంచాయితీ రాజ్ శాఖ గెస్ట్ హౌస్లో మాట్లాడారు. జీపీఎస్ లేని వాహనాల్లో ఇసుక నింపేందుకు అనుమతి నిరాకరించామని తెలిపారు. ఇప్పటి వరకు 10 కోట్ల టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. రానున్న పదేళ్ల వరకు ఇది సరిపోతుందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 130 ఇసుక రీచ్ లు పనిచేస్తున్నాయని.. రోజుకు 3 లక్షల 80 వేల టన్నుల ఇసుక లభ్యమవుతోందని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత లేదని స్పష్టం చేశారు. ఇసుక రవాణా పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
''ఇసుక అక్రమ రవాణా చేస్తే జైలు శిక్ష.. త్వరలోనే చట్టం'' - ఇసుకపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష వార్తలు
అక్రమంగా ఇసుక తరలిస్తే రెండేళ్ల జైలు శిక్ష పడేలా చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఇసుక కొరత లేదని అన్నారు.
minister peddireddy on sand policy