KTR tweet on Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో భాజపా అధికారంలోకి వస్తే రూ. 70 కే మద్యం విక్రయిస్తామన్న భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. వావ్.. వాట్ ఎ స్కీమ్.. వాట్ ఎ షేమ్ అంటూ వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఏపీ భాజపా నేతలు మరింతగా దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని ట్విటర్ వేదికగా విమర్శించారు. చీప్ లిక్కర్‌ను రూ. 50, రూ.70 కి విక్రయించడం భాజపా జాతీయ విధానమా లేక.. నిరాశవాదంలో కూరుకుపోయిన రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుందా అని ప్రశ్నించారు.
KTR tweet on Somu Veerraju: వావ్.. వాట్ ఎ స్కీం.. వాట్ ఎ షేమ్.. సోము వీర్రాజుపై కేటీఆర్ సెటైర్! - somu veerraju on liquor rates in ap
KTR tweet on Somu Veerraju: అధికారంలోకి వస్తే రూ. 75 కే చీప్ లిక్కర్ ఇస్తామంటూ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఇదే భాజపా జాతీయ విధానమా అని ట్విటర్ వేదికగా విమర్శించారు. భాజపా నేతలు మరింతగా దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
కేటీఆర్
సోము వీర్రాజు స్టేట్మెంట్
విజయవాడలో మంగళవారం జరిగిన భాజపా ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను కోటి ఓట్లతో గెలిపిస్తే.. లిక్కర్‌ను రూ. 70 కే విక్రయిస్తామని ప్రకటించారు. రాష్ట్ర రెవెన్యూ మెరుగ్గా ఉంటే రూ. 50 కే విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.