ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు... రాష్ట్రానికి పట్టిన వైరస్: మంత్రి కన్నబాబు - చంద్రబాబు తాజా వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి కన్నబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

minister kannababu
మంత్రి కన్నబాబు

By

Published : Feb 8, 2020, 10:17 PM IST

మీడియాతో మంత్రి కన్నబాబు

తెదేపా అధినేత చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాకుండా ఉందని మంత్రి కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు తన మాటలతో రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు. అమరావతిలో కృత్రిమ ఉద్యమాన్ని స్పష్టించారని ఆరోపించారు. పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు మాటల కంటే ప్రమాదకరమైన వైరస్ ఉంటుందా అని కన్నబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై బురద చల్లే కార్యక్రమాన్ని ఉపేక్షించబోమని తెలిపారు.

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్లు ఇస్తున్నామని... రేషన్‌కార్డు, పెన్షన్‌ విషయంలో ఇబ్బందులు వస్తే గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయాలని మంత్రి కన్నబాబు సూచించారు. ఒకవేళ పెన్షన్‌ ఆగిపోతే పునరుద్ధరిస్తామని... ఎవరూ కంగారు పడవద్దని చెప్పారు. రాష్ట్రంలో 33 విత్తన శుద్ధి కర్మాగారాలను ముఖ్యమంత్రి మంజూరు చేశాన్నారు.

ABOUT THE AUTHOR

...view details