ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దసరా నాటికి సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి నిధులు ఇస్తాం' - minister harish rao latest news

Minister Harish Rao: దసరా నాటికి సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకునే వారికి నిధులు ఇస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. సంగారెడ్డిలో పింఛనుదారులకు స్మార్ట్​ కార్డులను ఆయన పంపిణీ చేశారు.

Minister Harish Rao
మంత్రి హరీశ్​రావు

By

Published : Sep 1, 2022, 1:49 PM IST

Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో దసరా నాటికి సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు నిధులు ఇస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. సంగారెడ్డిలో పింఛనుదారులకు స్మార్ట్​ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు, నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంటే.. కేంద్రం ఉచితాలు ఇవ్వొద్దని చెబుతుందని హరీశ్​రావు విమర్శించారు. ఏడాదిలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా పింఛన్లు ఇస్తున్నాం. ఎంతమంది అర్హులుంటే అంతమందికి పింఛన్లు ఇవ్వాలని సీఎం చెప్పారు. ఎవరూ లేని వారికి పింఛను, బియ్యం భరోసా ఇస్తున్నాయి. ఉచితాలు బంద్ చేయాలని కేంద్రంలోని భాజపా చెప్తోంది. వ్యాపారులకు వేల కోట్లు మాఫీ చేస్తూ పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్నారు. కేంద్రంలోని భాజపా అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపింది. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటడంతో పేదలు కొనలేని పరిస్థితి. రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చాం. సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకునే వారికి నిధులు ఇస్తాం.-హరీశ్​రావు, ఆర్థికశాఖ మంత్రి

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details