ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: ఈటల - అందరికీ ధన్యవాదాలు'

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న వైద్యారోగ్య శాఖను... ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇన్ని రోజులు వైద్యారోగ్య శాఖ మంత్రిగా తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈటల ధన్యవాదాలు తెలిపారు.

minister-etela-rajender-convey-thanks-to-everyone-in-health-department
వైద్యారోగ్య శాఖ మంత్రిగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఈటల

By

Published : May 1, 2021, 7:55 PM IST

తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రిగా తనకు సహకరించిన అందరికీ ఈటల రాజేందర్​ ధన్యవాదాలు తెలిపారు. 395 రోజులుగా నిర్విరామంగా ఉద్యోగులు కృషి చేశారని కొనియాడారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడారని పేర్కొన్నారు. కుటుంబాలకు దూరంగా ఉండి వైద్య సేవలు అందించారని ఈటల ప్రశంసించారు. ఆరోగ్యశాఖలోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి ఈటల రాజేందర్​పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విచారణకు ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... వైద్యారోగ్య శాఖను ఆయన నుంచి తప్పించింది. ఆ శాఖ సీఎం కేసీఆర్ చేతికి వెళ్లింది.

ABOUT THE AUTHOR

...view details