ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: బొత్స

ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సింగపూర్ కంపెనీ సరైన సమాధానాలు ఇవ్వలేదని మంత్రి బొత్స చెప్పారు. ఈ కారణంగానే.. రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు రద్దు చేసుకున్నామని తెలిపారు.

minister bosta comments on experts committe

By

Published : Nov 18, 2019, 8:41 PM IST

Updated : Nov 18, 2019, 9:09 PM IST

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. తాము నియమించిన నిపుణుల కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తోందని అన్నారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. ఈ కమిటీ తెదేపా ప్రభుత్వం వేసిన నారాయణ కమిటీ తరహా కాదని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన...రాజధాని నిర్మాణంపై పలు వ్యాఖ్యలు చేశారు. సింగపూర్ సంస్థతో గత ప్రభుత్వం లోపభూయిష్టమైన ఒప్పందాలు చేసుకున్నందనే ఆ కంపెనీలు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. సదరు కంపెనీలు సమగ్ర డీపీఆర్ తో వస్తే కలిసి పనిచేయటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

కొత్తగా మూడు మార్కెట్ కమిటీలు

అనంతపురం జిల్లాలో మరో మూడు మార్కెట్ కమిటీలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 13 మార్కెట్ కమిటీలు ఉండగా, అదనంగా మరో మూడు కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఆస్పత్రుల కమిటీల్లో ఎంపీకి స్థానం

Last Updated : Nov 18, 2019, 9:09 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details