ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రష్యా పర్యటనకు మంత్రి బాలినేని.. ప్రత్యేక జెట్‌ విమానంలో ప్రయాణం - ap latest

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విదేశీ పర్యటనకు రష్యా వెళ్లారు. గతంలో మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్తే అది వ్యక్తిగతమా? అధికారికమా? అనేది పేర్కొంటూ పర్యటనలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చేది. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్ని ప్రజాబాహుళ్యానికి అందుబాటులో ఉంచట్లేదు. మంత్రి రష్యా పర్యటనపై తెదేపా తన అధికారిక ఫేస్‌బుక్‌, ట్విటర్‌ పేజీల్లో విమర్శలు చేసింది.

Minister Balineni
Minister Balineni

By

Published : Sep 7, 2021, 10:08 AM IST

రాష్ట్ర అటవీ, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. రష్యాకు వెళ్లిన ఆయన.. ప్రత్యేక జెట్‌ విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు. ‘సాకులు వెతుక్కోకుండా జీవించండి. హాయిగా పర్యటించండి (లివ్‌ లైఫ్‌ విత్‌ నో ఎక్స్‌క్యూజ్స్‌.. ట్రావెల్‌ విత్‌ నో రిగ్రెట్‌)’’ అంటూ ఓ క్యాప్షన్‌ను ఆ చిత్రానికి జోడించారు. గతంలో మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్తే అది వ్యక్తిగతమా? అధికారికమా? అనేది పేర్కొంటూ పర్యటనలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చేది. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్ని ప్రజాబాహుళ్యానికి అందుబాటులో ఉంచట్లేదు.

తెదేపా విమర్శలు

మంత్రి రష్యా పర్యటనపై తెదేపా తన అధికారిక ఫేస్‌బుక్‌, ట్విటర్‌ పేజీల్లో విమర్శలు చేసింది. ‘హవాలా కింగ్‌ బాలినేని’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ప్రైవేట్‌ జెట్‌లో ప్రయాణిస్తున్న చిత్రాన్ని వైరల్‌ చేసింది. ‘వైకాపా నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ఒక ప్రైవేటు విమానంలో రష్యాకు వెళ్లారు. వ్యక్తిగత ఫ్లైట్‌ అంటే మాటలు కాదు కదా! రూ.5 కోట్లు అవుతుంది. అంత డబ్బుతో హవా హవాయి అంటూ ఎంజాయ్‌ చేస్తున్నారంటే ఆ డబ్బంతా హవాలా పనులతో సంపాదించిందే కదా అనుకుంటున్నారు జనం’’ అని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

ఇదీ చదవండి: RAINS : రాష్ట్రంలో పొంగిపొర్లిన వాగులు, వంకలు... నేడు, రేపు భారీవర్షాలు

ABOUT THE AUTHOR

...view details