నూతన విధానంతో రాష్ట్రంలో అన్ని పర్యటక ప్రాంతాలకు సరికొత్త శోభ సంతరించుకోనుందని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయంలోని మూడో బ్లాక్లో పర్యటక, సాంస్కృతిక, క్రీడా, పురావస్తు శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు.
రాష్ట్రంలోని పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టుకోవడంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.